Sunday, October 28, 2007

తెలుగంటే ఎందుకంత అలుసు

ఎన్నాల్లనుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న ఇది. మనకే కాకుండా ప్రతి ఒక్కరికీ తెలుగంటే అలుసే. ఉత్తరాది వాల్లలో తెలుగంటే తెలియని వాల్లు బోలెడు. తెలుగనేది ఒక బాష అని భారతంలో అదికూడా ఒక అధికార బాష అనీ తెలియని వాల్లెందరో. అదే మనమయితే పొరిగుంటి పులగూర చందాన హింది అంటే పడి చస్తాము. ఉత్తరానికి వెళ్లి హింది మాట్లాడకపోతే వెధవలకి హిందీ రాదని అంటారు, అదే వాల్లు మన దక్షిణానికి వచ్చినపుడు కూడా వాల్ల బాషలోనే మాట్లాడాలని డిమాండు.

మన జాతీయ పతాక రూపకర్త గురించి వారికి తెలియదు. అల్లూరి వారి ద్రుష్టిలో అనామకుడు. ఉత్తమ చిత్రంగా దక్షిణానికి చెందిన ఏ చిత్రానికి ఇవ్వకూడదు, కేవలం ప్రాంతీయ బాషగానే పరిగణిస్తారు. ప్రధాన మంత్రులు కాకూడదు, పొరపాటున అయితే నానా హంగామా చేస్తారు. తెలుగు ప్రధాని మరణిస్తే సమాధికి కూడా ఢిల్లీ లో చోటుండదు. ఎంతగొప్పగా ఆడినా, కంగారూలకు కంగారు పుట్టించినా సరే జట్టులో స్థానముండదు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....

ఇవన్నీ జీవితంలో భాగమైనా ఎపుడూ అంతగా పట్టించుకోలేదు... ఎందుకంటే మనమంతా భారతీయులం అందరూ సమానమే అన్న భావన నరనరాన జీర్ణించుకోబట్టి....

కొన్నాల్ల క్రిందట జరిగిన సంఘటనే నా మనసును భయంకరంగా వేధిస్తోంది... ఏ జన్మలో చేసిన పాపమో కదా ఇప్పుడు ఉత్తరంలో వుండవలసివస్తోంది అని మొదటిసారిగా అనిపించింది. ఒక మిత్రుని ఇంటిదగ్గర పరిచయమైన కుటుంబంతోటి పిచ్చాపాటి మాట్లాడుతుండగా, అక్కడే వేరే పోర్షన్ లో కొత్తగా వచ్చిన వారిగురించి టాపిక్ వచ్చింది. వారిగురించి ఆమె మాటలలోనే..

ఆమె: వోలోగ్ ఆప్ కా జాత్ కా హీ హై
నేను: జీ సంఝా నహీ
ఆమె: వొలోగ్ ఆప్ కా జాత్ మానే సౌత్ కా హీ హై
నేను: ఐసా బోలోనా why are you using the word "jaat"(జాతి), we are all Indians
ఆమె: జో నీచేసే అయాహై వున్ లోగోంకో హం ఐసా హీ బులాతే హై
నేను: నీచెసే ఆయాహై మత్లబ్?
ఆమె: జో నీచే కా స్టేట్స్

అంటే మనము వేరు వాల్లు వేరా, ఇప్పటి వరకూ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు..మరి వాల్లకెందుకు అలా అనిపిస్తోంది..

ఇది కేవలం కడుపు మంట తోటి మాత్రమే రాసింది ... మరే వుద్దేశ్యం నాకు లేదు.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను ఎప్పటికీ భారతీయున్నే... నా జాతి ఒక్కటే "భారత జాతి".

6 comments:

రాధిక said...

నిజమే ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళంటే చాలా తక్కువ భావం.అలాగే దక్షిణాది వాళ్ళకి వాళ్ళ పక్క రాష్ట్రాల వాళ్ళంటే చిన్నచూపు.ఈ జాత్యాహంకారాలు ఎప్పటినుంచో వున్నవే.

Unknown said...

ఇలాంటివన్నీ, దేశ, రాష్ట్ర, ప్రాంత, జిల్లా, గ్రామ ఇలా అన్ని స్థాయిలలో ఉండేవే. మనమే ఇలా అనుకుంటే ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఏమనుకోవాలి (వాళ్ళలో చాలామంది నిజంగానే వేరేజాతి ప్రజలు మరి)

Satyasuresh Donepudi said...

తెలుగు భాష గురించి చాలా బాగా వ్రాశారు.

మీ తప్పు గా భావించక పోతే : 'ల్లు ' బదులు 'ళ్ళు ' వాడితే బాగుండేది.

ఇట్లు: ఆంధ్ర నుండి అమెరికా వరకు... (ap2us.blogspot.com)

సాయి ఋత్విక్ said...

అతి ప్రాచీనమైన మన అద్భుత తెలుగు భాషను మన తెలుగు వాళ్ళమే నిర్లక్ష్యం చెస్తున్నాము అంటే అతిశయొక్తి కాదెమో ? తెలుగు పుస్తకాలను, నవలలను, కావ్యాలను, కధలు, కధానికలను ఆదరించడం మానెశాం. తెలుగు పుస్తకాలు చదవడం అంటే మనకు నామోషి.తెలుగులో మాట్లాడడం అంటే చిన్నతనం. అరువు తెచ్చుకున్న ఇంగ్లీషు బాషంటే అపరితమైన మోజు.అమ్మా, నాన్నలను వదిలేసి, మమ్మి, డాడీ అంటే ఏంతొ ఇష్టం మనకు, కనీసం మన పొరుగు రాష్ట్రాల వారినైనా చూసి నేర్చుకొము. అందుకే మన భాషంటే అందరికీ అలుసైపోయింది. తెలుగు సోదర సోదరీమనుణారా, అందరం చెయి చెయి కలుపుదాం. తేలుగు భాష యొక్క గొప్పదన్నాన్ని,పరిమళాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తేలియజేద్దాం.

కొత్త పాళీ said...

వింతగా నిన్ననే మా సాహితీ సమావేశంలో ఈ సంగతి చర్చకి వచ్చింది. శ్రీపాద వారు రాసిన "శుభికే శిర ఆరోహ" అనే కథ అక్కడ చర్చనీయాంశం. తన జాతి సంస్కృతిలో ఉన్న ఔన్నత్యం గుర్తించుకోక హిందీ పద్ధతులే గొప్పవి అని గుడ్డి నమ్మకాన్ని అనితరసాధ్యమైన శైలిలో ఎగతాళి చేశారు శ్రీపాద వారు. పొరుగువాడి కంటే మనదే ఏదో గొప్ప అనే ఫీలింగ్ వాళ్ళకి కొంత ఉండగా, మనమేదో తక్కువ వాళ్ళే ఎక్కువ అనే ఫీలింగ్ మనకీ ఉండటం మన దౌర్భాగ్యం. అది ముందు అరికట్టుకోవాలి.

వేణు said...

@ రాధిక గారు
నిజమే జాత్యహంకారాలు ఎప్పటినుంచో వున్నాయి
@ తెలుగువీర గారు
మీరన్నది నిజమే, ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడ్డారు
@ మనవాడు గారు
అచ్చు తప్పులు దొర్లాయి, ఇకనుండి శ్రద్ధ తీసుకుంటాను. నెనర్లు వేణు
@ అభయ్ గారు
చేయి చేయి కలుపుదాం
తెలుగు వెలుగును లోకానికి పంచుదాం..
@ కొత్త పాళి గారు
శ్రమ అనుకోకపోతే శ్రీపాద గారి కథాంశాన్ని అందరితో పంచుకోగలరు.

మీ వేణు