Thursday, October 4, 2007

చిరుత-తెలుగుదనం

ఇప్పుడే చిరుత చూసి వస్తున్నా!!! వెంటనే ఏదో ఒకటి బ్లాగేయాలని పించింది. కానీ ఏమి రాద్దామన్న చాలామంది చాలా రాసేశారు. నాకు మొదటగా నచ్చనిది పాటలు. "తెలుగు పదాలు వేనవేలు" అని పెద్దలన్నారు గానీ, పాపం ఆ పాటల రచయితకు గానీ, సంగీతం సమకూర్చిన పెద్దాయనకు గానీ తెలిసినట్టులేదు, అందుకేనేమో అన్ని హిందీ పదాలు ఇంగ్లిష్ పదాలున్నూ...

ఇక హైదరాబాదు లో వున్న నాయకికి తెలుగురాదు...(కొంచం నత్తి అనుకుంటాను)ఆవిడగారి చెలికత్తెలు తెలుగువాల్లుకాదు...(అలా కానప్పుదు ఇక్కడేమి ఉద్ధరిస్తున్నారో ఆ పూరి జగన్నాథుడికే తెలియాలి)

ఇంకా చాలా రాయాలని వున్నా ఇప్పుడు నా శిరోభారం తగ్గాలంటే అర్జెంట్గా ఏదైనా తెలుగు సినిమా చూసేయాలి...

"నన్ను దోచుకుందుటవే వన్నెల దొరసాని"

అదేనండోయ్ "గులేబకావలి కథ" చూడబోతున్నాను ఇప్పుడు... తప్పదు ఇప్పుడు రాత్రి 12:15 అయ్యింది, రేపు కార్యాలయం పోకపోయినా సరే........

1 comment:

రానారె said...

అదన్నమాట సంగతి. :) మనసు తేలికపడటానికి విజయా వారి 'మిస్సమ్మ' సినిమా ఎప్పుడైనా చూడదగినదిగా అనిపిస్తుంది. ఎక్కడనుంచీ మెదలెట్టి చూసినా రమ్యంగా ఉంటుంది.