బ్లాగమ్మలారా, బ్లాగయ్యలారా!!
నాపేరు బ్లెవిట్ ఔల్ అదే ఒక రకమైన గుడ్లగూబని. కేవలం విశాఖపట్టణం మరియు ఒరిస్సా దరిదాపుల ఉన్న అడవులలో మాత్రమే వుంటాను. మరో విశేషమంటే మనిషి వేటాడి వేటాడి వదలగా ఇప్పుడు కేవలం 250 మాత్రమే మిగిలాము అదికూడా పూర్తిగా అంతరించే దశలో. అప్పుడెప్పుడో 19వ శతాబ్ధంలో మీకొకసారి కనిపించాము తరువాత 1997 లో ఒక్కసారి కనిపించాము, నిజం చెప్పాలంటే మీకు కనపడాలంటే భయం ఎక్కడ పలావు అయిపోతామేమోనని. ఏదో మనిషికి కనిపించకుండా అలా బ్రతుకీడుస్తుంటే ఇప్పుడు బాక్సైట్ భయం పట్టుకుంది. మేమున్న అడవుల్లోనే అది వుందట, దానిమీదేమో ఒక పెద్ద పారిశ్రామిక కుటుంబం కన్ను పడింది. అంతే ఇక ఏముంది అక్కడ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివెనువెంటనే లభించాయి. ఇక మాకేమన్నా నష్టం కలుగుతుందేమేనని అధ్యయనం చేయడాంకి ఒక బెంగలూరికి చెందిన సంస్థ కు అప్పజెప్పారు.వారేమో ఇప్పుడు మాకు ఏ నష్టం లేదని సెలవిచ్చి మినుకుమినుకని వెలుగుతున్న గుడ్డి దేపాన్ని కాస్త ఆర్పేశారు.
అయ్యలారా, అమ్మలారా మమ్మల్ని కాపాడే వాల్లే లేరా. మేధా పాట్కరక్క అనే ఆవిడ మాలాంటి వాల్ల కోసమై ఉద్యమాలు చేస్తారని విన్నాం. ఎప్పుడు "నర్మదా బచవో" "నర్మదా బచవో" అనేమాటే కాకుండా ఒక్కసారి మమ్మల్ని కూడా బచావో అనొచ్చుకదా, ఓ మేనకా గాంధి అక్కా, ఓ అరుంధతీ రాయాక్కా మీరైనా ఓ చూపు ఇటు చూడకపోయారా. హైదరాబాదులో వుండే అమలక్కా వీధి కుక్కలకంటే మేము హీనమయ్యామా.
మీకందరికీ ఒకటే మనవి. ఒకప్పుడు మేము ఉండే వాల్లమని కనీసం మేరైనా గుర్తుపెట్టుకోండి. ఎంతైనా మేము కూడా మీలాంటి జీవులమే కదా.
ఇట్లు అంతరిస్తున్న మరో బక్క ప్రాణి....
మూలం
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
ఇది చదువుతుంటే జాషువా గారి గబ్బిలం గుర్తుకు వచ్చింద.
మంచి విషయం రాసారు ఇలా అంతరించిపోతున్న జీవులు చాలా ఉన్నాయి
బతికున్న మనుషులకే దిక్కు లేదు, ఇక గుడ్లగూబల్నేమి పట్టించుకుంటుంది మన ప్రభుత్వం ?
డిట్టో ప్రవీణ్
సామాజిక స్పృహ,ప్రకృతి సమతుల్య పరిరక్షణ పై ఆలోచింప చేసే అంశాలు ఈ వ్యాసం లో ఉన్నాయి. ధన్యవాదాలు.
కాకినాడ ప్రాంతలో అనుకుంట, ఏనుగులు ప్రజలని ఇబ్బంది పెడుతున్నవని అన్నారు.
నిజమేనా?
ఏనుగులని మనుషులు ఇబ్బంది పెట్టడం లేదా?
పర్యావరణం, ప్రకృతి రక్షణ, మన కర్తవ్యాలని గుర్తుచేసే ఇటువంటి రచనలు మరిన్ని రావాలి. వేణూకి అభినందనలు.
అభివృద్ధిపేరుతో అనేకానేక ఘోరకృత్యాలు చేస్తున్నాం మనం (భారతదేశంలోనే ఖాదు, ప్రపంచమంతటా). వేల హెక్టార్ల అడవులు నీటిపాలై జీవరాశులు నాశనమౌతాయని తెలిసి కూడా భారీ ప్రాజెక్టులు నిర్మించడం ఆపట్లేదు. కొన్ని చోట్ల జాతీయ అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఈ విషయం చెప్పినా నిర్మాణాలు ఆగటల్లేదు. ఇక అస్సలు ఆధునిక అభివృద్ధి లేని ప్రదేశాల్లో ప్రైవేటు పెట్టుబడు లొస్తున్నాయంటే రిపోర్టుల నాలుకల్ని శాసింఛడం ఎంత సేపు?
అందరికీ నెనర్లు.
మీ వేణు
Post a Comment