Monday, October 29, 2007

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు

అందరూ ఆహ్వానితులే!!!

పూణే లో జరగనున్న సభను జయప్రదం చేయవలెనని మనవి.

ఆంధ్ర అసోసియేషన్ వారి ఆహ్వాణం.
-------------------------------------------------------------------------------------
The Andhra Association, Pune requests the pleasure of your company with family and friends for ANDHRA PRADESH FORMATION DAY CELEBRATIONS on the 1st of November 2007 at 6.00 pm .

Venue : Balgandharv Rang Mandir, Junglee Maharaj Road, Deccan Pune.

Entry : Free

Programmes :

1.Felicitation : Dr.Kalipatnam Rama Rao (Distinguished writer, Founder:Katha Nilayam and central Sahitya Academy Awardee)

2. Janapada Kala Rupamulu (courtesy : International Telugu centre, Sri Potti Sriramulu Telugu University)

3. Mimicry : Sri Vedula P. Srinivas (has presented more than 150 shows in India and abroad)

4. Natika : "Cheema Kuttina Natakam" (Written by sri Yandamuri abridged and directed by Dr.Bhagavatula Prasad.


Let us all be present for the celebrations along with friends and family and make it a huge success.

Thanking you

Trust Committe
Andhra Association, Pune
-------------------------------------------------------------------------------------

Sunday, October 28, 2007

తెలుగంటే ఎందుకంత అలుసు

ఎన్నాల్లనుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న ఇది. మనకే కాకుండా ప్రతి ఒక్కరికీ తెలుగంటే అలుసే. ఉత్తరాది వాల్లలో తెలుగంటే తెలియని వాల్లు బోలెడు. తెలుగనేది ఒక బాష అని భారతంలో అదికూడా ఒక అధికార బాష అనీ తెలియని వాల్లెందరో. అదే మనమయితే పొరిగుంటి పులగూర చందాన హింది అంటే పడి చస్తాము. ఉత్తరానికి వెళ్లి హింది మాట్లాడకపోతే వెధవలకి హిందీ రాదని అంటారు, అదే వాల్లు మన దక్షిణానికి వచ్చినపుడు కూడా వాల్ల బాషలోనే మాట్లాడాలని డిమాండు.

మన జాతీయ పతాక రూపకర్త గురించి వారికి తెలియదు. అల్లూరి వారి ద్రుష్టిలో అనామకుడు. ఉత్తమ చిత్రంగా దక్షిణానికి చెందిన ఏ చిత్రానికి ఇవ్వకూడదు, కేవలం ప్రాంతీయ బాషగానే పరిగణిస్తారు. ప్రధాన మంత్రులు కాకూడదు, పొరపాటున అయితే నానా హంగామా చేస్తారు. తెలుగు ప్రధాని మరణిస్తే సమాధికి కూడా ఢిల్లీ లో చోటుండదు. ఎంతగొప్పగా ఆడినా, కంగారూలకు కంగారు పుట్టించినా సరే జట్టులో స్థానముండదు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....

ఇవన్నీ జీవితంలో భాగమైనా ఎపుడూ అంతగా పట్టించుకోలేదు... ఎందుకంటే మనమంతా భారతీయులం అందరూ సమానమే అన్న భావన నరనరాన జీర్ణించుకోబట్టి....

కొన్నాల్ల క్రిందట జరిగిన సంఘటనే నా మనసును భయంకరంగా వేధిస్తోంది... ఏ జన్మలో చేసిన పాపమో కదా ఇప్పుడు ఉత్తరంలో వుండవలసివస్తోంది అని మొదటిసారిగా అనిపించింది. ఒక మిత్రుని ఇంటిదగ్గర పరిచయమైన కుటుంబంతోటి పిచ్చాపాటి మాట్లాడుతుండగా, అక్కడే వేరే పోర్షన్ లో కొత్తగా వచ్చిన వారిగురించి టాపిక్ వచ్చింది. వారిగురించి ఆమె మాటలలోనే..

ఆమె: వోలోగ్ ఆప్ కా జాత్ కా హీ హై
నేను: జీ సంఝా నహీ
ఆమె: వొలోగ్ ఆప్ కా జాత్ మానే సౌత్ కా హీ హై
నేను: ఐసా బోలోనా why are you using the word "jaat"(జాతి), we are all Indians
ఆమె: జో నీచేసే అయాహై వున్ లోగోంకో హం ఐసా హీ బులాతే హై
నేను: నీచెసే ఆయాహై మత్లబ్?
ఆమె: జో నీచే కా స్టేట్స్

అంటే మనము వేరు వాల్లు వేరా, ఇప్పటి వరకూ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు..మరి వాల్లకెందుకు అలా అనిపిస్తోంది..

ఇది కేవలం కడుపు మంట తోటి మాత్రమే రాసింది ... మరే వుద్దేశ్యం నాకు లేదు.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను ఎప్పటికీ భారతీయున్నే... నా జాతి ఒక్కటే "భారత జాతి".

Sunday, October 21, 2007

ఆశేష తెలుగు బ్లాగర్లకు విజయ దశమి శుభాకాంక్షలు....

మీ వేణు

Saturday, October 20, 2007

మనకు ఏదో ఒక ఫ్లాష్ న్యూస్ వుండాలి లేదంటే సరదాగా వుండదు. పోయిన వారం రాజీవశేఖరుడు, చంద్రబాబు ఒకరిమీద ఒకరు బురద జల్లుకున్నారు...సదా మామూలే రాజకీయాలతో మనకు బోలెడు వినోదం.

ఇప్పుడు ఎక్కడ చూసినా చిరంజీవి కూతురి విశేషాలే... కొందరు విశ్లేషకులు ఇంకొంచం ముందుకు వెల్లి ఆ అబ్బాయి (పేరేంటో గుర్తు లేదు..గుర్తుంచుకోవాలిసిన అవసరము కూడా లేదు) పూర్వ చరిత్రను కూడా కూపీ లాగి మరీ వినోదాన్ని పంచాలని చూస్తున్నారు...

సరే ఇటువంటి పరిస్థితులలో సాటి తల్లిదండ్రులుగా చిరంజీవి దంపతుల మానసిక స్థితి గురుంచి ఒక్కరూ రాసిన పాపానపోలేదు.. సరికదా అగ్ని కి ఆజ్యం పోసినట్టు రాస్తున్నారు... మరీ ఇంత పబ్లిసిటి ఇవ్వాల్సిన విషయమా ఇది...

Saturday, October 6, 2007

బ్లాగమ్మలారా, బ్లాగయ్యలారా!! ఒక మనవి

బ్లాగమ్మలారా, బ్లాగయ్యలారా!!

నాపేరు బ్లెవిట్ ఔల్ అదే ఒక రకమైన గుడ్లగూబని. కేవలం విశాఖపట్టణం మరియు ఒరిస్సా దరిదాపుల ఉన్న అడవులలో మాత్రమే వుంటాను. మరో విశేషమంటే మనిషి వేటాడి వేటాడి వదలగా ఇప్పుడు కేవలం 250 మాత్రమే మిగిలాము అదికూడా పూర్తిగా అంతరించే దశలో. అప్పుడెప్పుడో 19వ శతాబ్ధంలో మీకొకసారి కనిపించాము తరువాత 1997 లో ఒక్కసారి కనిపించాము, నిజం చెప్పాలంటే మీకు కనపడాలంటే భయం ఎక్కడ పలావు అయిపోతామేమోనని. ఏదో మనిషికి కనిపించకుండా అలా బ్రతుకీడుస్తుంటే ఇప్పుడు బాక్సైట్ భయం పట్టుకుంది. మేమున్న అడవుల్లోనే అది వుందట, దానిమీదేమో ఒక పెద్ద పారిశ్రామిక కుటుంబం కన్ను పడింది. అంతే ఇక ఏముంది అక్కడ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివెనువెంటనే లభించాయి. ఇక మాకేమన్నా నష్టం కలుగుతుందేమేనని అధ్యయనం చేయడాంకి ఒక బెంగలూరికి చెందిన సంస్థ కు అప్పజెప్పారు.వారేమో ఇప్పుడు మాకు ఏ నష్టం లేదని సెలవిచ్చి మినుకుమినుకని వెలుగుతున్న గుడ్డి దేపాన్ని కాస్త ఆర్పేశారు.

అయ్యలారా, అమ్మలారా మమ్మల్ని కాపాడే వాల్లే లేరా. మేధా పాట్కరక్క అనే ఆవిడ మాలాంటి వాల్ల కోసమై ఉద్యమాలు చేస్తారని విన్నాం. ఎప్పుడు "నర్మదా బచవో" "నర్మదా బచవో" అనేమాటే కాకుండా ఒక్కసారి మమ్మల్ని కూడా బచావో అనొచ్చుకదా, ఓ మేనకా గాంధి అక్కా, ఓ అరుంధతీ రాయాక్కా మీరైనా ఓ చూపు ఇటు చూడకపోయారా. హైదరాబాదులో వుండే అమలక్కా వీధి కుక్కలకంటే మేము హీనమయ్యామా.

మీకందరికీ ఒకటే మనవి. ఒకప్పుడు మేము ఉండే వాల్లమని కనీసం మేరైనా గుర్తుపెట్టుకోండి. ఎంతైనా మేము కూడా మీలాంటి జీవులమే కదా.

ఇట్లు అంతరిస్తున్న మరో బక్క ప్రాణి....
మూలం

Thursday, October 4, 2007

చిరుత-తెలుగుదనం

ఇప్పుడే చిరుత చూసి వస్తున్నా!!! వెంటనే ఏదో ఒకటి బ్లాగేయాలని పించింది. కానీ ఏమి రాద్దామన్న చాలామంది చాలా రాసేశారు. నాకు మొదటగా నచ్చనిది పాటలు. "తెలుగు పదాలు వేనవేలు" అని పెద్దలన్నారు గానీ, పాపం ఆ పాటల రచయితకు గానీ, సంగీతం సమకూర్చిన పెద్దాయనకు గానీ తెలిసినట్టులేదు, అందుకేనేమో అన్ని హిందీ పదాలు ఇంగ్లిష్ పదాలున్నూ...

ఇక హైదరాబాదు లో వున్న నాయకికి తెలుగురాదు...(కొంచం నత్తి అనుకుంటాను)ఆవిడగారి చెలికత్తెలు తెలుగువాల్లుకాదు...(అలా కానప్పుదు ఇక్కడేమి ఉద్ధరిస్తున్నారో ఆ పూరి జగన్నాథుడికే తెలియాలి)

ఇంకా చాలా రాయాలని వున్నా ఇప్పుడు నా శిరోభారం తగ్గాలంటే అర్జెంట్గా ఏదైనా తెలుగు సినిమా చూసేయాలి...

"నన్ను దోచుకుందుటవే వన్నెల దొరసాని"

అదేనండోయ్ "గులేబకావలి కథ" చూడబోతున్నాను ఇప్పుడు... తప్పదు ఇప్పుడు రాత్రి 12:15 అయ్యింది, రేపు కార్యాలయం పోకపోయినా సరే........