ఈ మధ్య నాకు మరొక మిత్రునికి జరిగిన సంభాషణలో చిన్న సంవివాదం జరిగింది. నేను మిత్రులే ముఖ్యమని, తను బంధువులే ముఖ్యమని...
మిత్ర బ్లాగ్గర్లకు నా మనవి....
ఈ విషయం పైన మీ మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇచట టపా చేయగలరు
భవదీయుడు
మీ వేణు
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఎవరి ప్రాముఖ్యం వారికుంది. కాని నేను మాత్రం మిత్రులే ముఖ్యమంటాను. స్నేహం చెయ్యగలగడం ఒక కళ. అది నిలుపుకోవడం ఎన్నో త్యాగాల మీదా ఔదార్యాల మీదా ఆధారపడి ఉంటుంది.అవి ఉన్నవారికి మంచి మిత్రులేర్పడతారు. మన దగ్గర అవి ఉంటే మనకు ప్రపంచమంతటా మిత్రులేర్పడతారు. నాకు మంది నా మిత్రులే. బంధువులు కారు. మా బంధువులు చాలా దుష్టులు కూడాను.
బంధువుల విషయంలో మనకు ఎంచుకునే స్వేచ్ఛ లేదు. వారు పుట్టుకతోనే ఏర్పడతారు. కాని మన నుంచి వారు రీతులనీ రివాజులనీ లాంఛనాలనీ మర్యాదలనీ ఏవేవో ఆశిస్తూంటారు. అదీ జీవితాంతం. ఎంత చేసినా తక్కువేనంటారు. సహాయం మాటకొస్తే ఒక్కడూ కనిపించడు.
మన హిందూమతం బాంధవ్యాలకు చాలా పెద్ద పీట వేసింది. అందరూ ఒకే ఊళ్ళో ఉమ్మడి కుటుంబాలుగా బతికిన రోజుల్లో బంధువే మిత్రుడుగా మిత్రుడే బంధువుగా వ్యవహరించిన రోజుల్లో అదంతా సరైనదే. కానీ మారిన పరిస్థితుల్లో కాదు.
ఎవరి ప్రాముఖ్యం వారికుంది. కాని నేను మాత్రం మిత్రులే ముఖ్యమంటాను. స్నేహం చెయ్యగలగడం ఒక కళ. అది నిలుపుకోవడం ఎన్నో త్యాగాల మీదా ఔదార్యాల మీదా ఆధారపడి ఉంటుంది.అవి ఉన్నవారికి మంచి మిత్రులేర్పడతారు. మన దగ్గర అవి ఉంటే మనకు ప్రపంచమంతటా మిత్రులేర్పడతారు. నాకు సహాయం చేసినవారు 90 శాతం మంది నా మిత్రులే. బంధువులు కారు. మా బంధువులు చాలా దుష్టులు కూడాను.

Post a Comment