రోజులా సాయంకాలం నడక ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్నాను. ఎదురుగా వినాయకుడి వూరేగింపు వస్తోంది. అందరూ పూనకం వచ్చినట్టు వూగిపోతున్నారు. లౌడ్ స్పీకర్ల హోరులో నాకు మొదట పాట అర్థం కాలేదు, తరువాత కొద్ది కొద్దిగా తలకెక్కింది. (అసలే మనకు ఆ హింది రాదు, పడదు)
మొదటి చరణం: ఏ కాలియా కిత్నే ఆద్మీ థే
తరువాత 2 నిముషాలు అర్థం కాని సౌండ్
మల్లీ చరణం: మైనే ఆప్కా నమక్ ఖాయా
మల్లీ 2 నిముషాలు భయంకరమైన హోరు... వీల్లేమో ఇంకా రెచ్చి పోయి వూగిపోతున్నారు
మల్లీ చరణం: లే అబ్ గోలీ ఖాలే
మల్లీ 2 నిముషాలు అర్థం కానీ డప్పుల మోత...
ఇదేమి భక్తిరా బాబు..
వినాయకుడు అక్కడ వున్నడో లేక పారిపోయాడో తనకే తెలియాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment