Friday, September 28, 2007

గిరీశం చెప్పిన కవిత!!!!

She leaves her bed at A.M. four,
And sweeps the dust from off the floor,
And heaps it all behind the door,
||The Widow||

Of wond', rous size she makes the cake,
And takes much pains to boil and bake,
And eats it all without mistake,
||The Widow||

Through fasts and feasts she keeps her health,
And pie on pie, she stores by stealth,
Till all the town talk of her wealth,
||The Widow||

And now and then she takes a mate,
And lets the hair grow on her pate,
And cares a hang what people prate,
||The Widow||

I love the widow......however she be,
married again.....or single free,
Bathing and praying,
or frisking and playing,
A model of saintliness,
Or model of comeliness,
What were the earth,
But for her birth?
||The Widow||


గుర్తుకొచ్చిందా మరి, గురజాడ గారు తన గిరీశంచే చెప్పించిందేనండి..(నా సొంత కవిత్వం కాదు సుమండీ)

Saturday, September 22, 2007

మిత్రులా...........బంధువులా

ఈ మధ్య నాకు మరొక మిత్రునికి జరిగిన సంభాషణలో చిన్న సంవివాదం జరిగింది. నేను మిత్రులే ముఖ్యమని, తను బంధువులే ముఖ్యమని...

మిత్ర బ్లాగ్గర్లకు నా మనవి....

ఈ విషయం పైన మీ మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇచట టపా చేయగలరు

భవదీయుడు
మీ వేణు

Thursday, September 20, 2007

యువరాజు సిక్సర్ల మోత

యువరాజు సిక్సర్ల మోతను కాస్త ఎంజాయ్ చెయ్యండి...

క్రికెట్ అధ్బుతం

యువరాజ్ వెల్ డన్!!!
6 సిక్సులు బాది వంద కోట్ల మదినిండా అనందం నింపావు.....

Monday, September 17, 2007

వీళ్ల భక్తి ఎలుకలెత్తుకు పోను....

రోజులా సాయంకాలం నడక ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్నాను. ఎదురుగా వినాయకుడి వూరేగింపు వస్తోంది. అందరూ పూనకం వచ్చినట్టు వూగిపోతున్నారు. లౌడ్ స్పీకర్ల హోరులో నాకు మొదట పాట అర్థం కాలేదు, తరువాత కొద్ది కొద్దిగా తలకెక్కింది. (అసలే మనకు ఆ హింది రాదు, పడదు)

మొదటి చరణం: ఏ కాలియా కిత్నే ఆద్మీ థే
తరువాత 2 నిముషాలు అర్థం కాని సౌండ్
మల్లీ చరణం: మైనే ఆప్కా నమక్ ఖాయా
మల్లీ 2 నిముషాలు భయంకరమైన హోరు... వీల్లేమో ఇంకా రెచ్చి పోయి వూగిపోతున్నారు
మల్లీ చరణం: లే అబ్ గోలీ ఖాలే
మల్లీ 2 నిముషాలు అర్థం కానీ డప్పుల మోత...

ఇదేమి భక్తిరా బాబు..
వినాయకుడు అక్కడ వున్నడో లేక పారిపోయాడో తనకే తెలియాలి.

Sunday, September 16, 2007

నాకు నచ్చిన కొన్ని కూనలమ్మ పదాలు

సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విశ్రాంతి
ఓ కూనలమ్మ!

పరుల తెగడుట వల్ల
బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల
ఓ కూనలమ్మ!

ఆత్మవంచన వల్ల
ఆడు కల్లల వల్ల
ఆగును హృదయమ్ము డొల్ల
ఓ కూనలమ్మ!

Saturday, September 15, 2007

ఈ మధ్య నేను చదివిన తెలుగు కథలు

సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి
కథ చాలా అధ్బుతంగా వుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన గుర్తు కానీ కథ గుర్తులేదు. ఈ మధ్య ఒకసారి విశాలాంధ్ర లో కనిపించింది వెంటనే కొనేశాను. మరికొన్ని కథా విశేషాలతో మల్లీ కలుద్దాం.. ఆంతవరకూ సెలవు

మీ వేణు
తెలుగులో విశేషాలు త్వరలో మీముందుకు రాబోతోంది......
అంతవరకూ కూసింత ఆగండి మరి