Wednesday, December 24, 2008

తెలుగు హృదయం

XYZ తో భేటీ అయ్యారు.. (సమావేశం అనొచ్చుగా)
ఏదో ఒక వీధిలో చోరీ జరిగింది (దొంగతనం)
పొత్తులు ఖరారు (కుదిరాయనో మరేదో అనొచ్చుగా)
ఇలాఖా(ప్రాంతం లేదంటే సామ్రాజ్యం)
సర్కారు (ప్రభుత్వం) 
కబ్జా (ఆక్రమన అని ఏడవచ్చుగా)

ఇలా తెలుగు ఎప్పుడో పద-కాలుష్యం అయ్యింది. వీటికి సరిపోయే తెలుగు పదాలే లేవా? ఏ బుల్లితెర కార్యక్రమం చూసినా, ఏ తెలుగు వార్తాపత్రిక చూసినా ఇదే ఏడుపు. ఒకవైపు ప్రాచీన బాషగా గుర్తింపు అంటారు, మరో వైపు తెలుగును కాపాడాలి అంటారు కానీ కనీసం ఇలాంటి చిన్న చిన్న తప్పులు దొర్లకుండా ఈ మీడియా తమను తాము మార్చుకోవా..  

మరో వింతైన ఘటన... ఈ మధ్యనే మాకు తెలిసినవాళ్ల పిల్లాడిని నీకు తెలిసిన పుణ్యదంపతుల పేర్లు అని అడిగితే ఠక్కున అభిషేక్ & ఐశ్వర్య అనంగానే ఏమనాలో మాకు తోచలేదు.  వీళ్లు ఎప్పుడో మన పురాణగాథలు మరచిపోయారు. హరిశ్చంద్రుడు తెలియకపోయినా కనీసం మన ముందుతరంలో ని మన జాతిపిత అయినా తెలియాలి కదా.  


Wednesday, September 3, 2008

Eco-Friendly వినాయకులు కొలువైన వేళ

బ్లాగర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

భారీ వినాయక విగ్రహాల పోటీ గురించి అందరికీ తెలిసిందే కానీ వాటి తయారీకి వాడే వస్తువుల వల్ల పర్యావరణానికి వాటిల్లే ముప్పు గురించి చాలా తక్కువ మంది మాత్రమే అలోచిస్తుంటారు. రోజు అనంతపురం నగరంలో నిలిపిన వినాయకుని విగ్రాహాలివి.
1. కొబ్బరి గిన్నెలతో (ఎండు కొబ్బరి, చిప్పలు తీసివేసినవి) భారీ వినాయకుడు.
2. అనంతపురం జిల్లలో ఫాక్షనిజం రూపుమాపాలని వివిధ ఆయుధాలతో రూపొందిన ఆయుధాల వినాయకుడు.
3. ఫ్రూటీ లతోటి చేసిన బొజ్జ గణపయ్య.

ఎంతయినా పర్యావరణానికి ముప్పు కలగకుండా విగ్రహాలను చేసిన వారందరికీ అభినందనలు.

Friday, April 4, 2008

ఈనాటి గాంధి - ఒక కామెంట్ కొట్టు గురూ...


నిన్న రాత్రి అనంతపురం నగర వీధుల్లో కనిపించిన దృశ్యం.

దీనికి మీ స్పందన?

Saturday, March 15, 2008

కనుక్కోండి చూద్దాం!!! (సరదా సరదాగా )


ఇవి ఏ పూలో కనుక్కోండి చూద్దాం!!!.